కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 18, 19, 20, 21, 22, 23, 24 వార్డ్లకు చెందిన నూతన అసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కామారెడ్డి వార్డుల్లో మంజూరైన 347 నూతన అసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
కొత్తగా పట్టణానికి 3 వేల 291 మందికి మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి మంజూరు చేసిన కొత్త పెన్షన్లు కామారెడ్డి పట్టణంలో 3 వేల 149 మంజూరైనట్టు తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు లేవని అన్నారు. బిజెపి నాయకులు చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదని, దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే చాలని అన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.