కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నిమజ్జనం చేయడానికి అవసరమైన క్రేన్లను సమకూర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శీను, ఏఎస్పీ అన్యోన్య ,డిఎస్పి సోమనాథం, పోలీసులు పాల్గొన్నారు.