జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు ధర రూ.17 500 పలికింది. గురువారం గణపతి లడ్డుకు వేలంపాట నిర్వహించారు. లడ్డు దక్కించుకోవడానికి ఇద్దరు ఉద్యోగులు పోటీపడ్డారు.

జిల్లా ఎడి మైన్స్‌ అధికారి నర్సిరెడ్డి రూ.17,000 పాడారు. చివరకు టీఎన్జీవోఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు రూ.17,500 పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సాయిలును టీఎన్జీవోస్‌, టిఎన్‌జివో ప్రతినిధులు సాయిరెడ్డి, రాజారాం, శివకుమార్‌, రాజకుమార్‌, విద్యాసాగర్‌, రాధాకృష్ణ, అశోక్‌, సాయి భుజంగరావు సన్మానించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »