జిల్లా ప్రజలకు గమనిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహిస్తూ వచ్చిన ప్రజావాణి కార్యక్రమం, ఇకపై కొత్త కలెక్టరేట్‌లో కొనసాగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు.

ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు గారిచే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ప్రారంభోత్సవం చేసుకున్న నేపధ్యంలో న్యూ కలెక్టరేట్‌ వేదికగా జిల్లా పాలన కొనసాగుతోందని వివరించారు. ఇందులో భాగంగానే ప్రజావాణి కార్యక్రమం కూడా ఇకపై కొత్త కలెక్టరేట్‌లోనే ప్రతీ సోమవారం ఉదయం 10.00 గంటల నుండి ప్రారంభమవుతుందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »