బిసి వసతి గృహం సంక్షేమ అధికారి సస్పెండ్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, అలసత్వం వహించిన బీర్కూర్‌ బిసి వసతి గృహం సంక్షేమ అధికారి (ఎఫ్‌ఏసి) ఆర్‌.సందీప్‌ ను విధుల నుండి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్‌ నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నందుకు విధుల నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బోర్లంలోని ఎస్సీ అభివృద్ధిశాఖ వసతి గృహంలో వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్‌-2 గా విధులు నిర్వహిస్తూ బీర్కూర్‌ బిసి అభివృద్ధి శాఖ వసతి గృహం సంక్షేమ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్‌.సందీప్‌ను విధుల నుండి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా వర్క్‌ హెడ్‌ క్వార్టర్‌ని వదిలి వెళ్లరాదని జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »