కామారెడ్డి, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ అభయాంజనేయ ఆర్యవైశ్య సంఘం, కల్కి నగర్, కామారెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆర్కె డిగ్రీ కళాశాలలో సంఘం సభ్యులైన 12 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం అధ్యక్షుడు తాటిపాముల సుధాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని వివరించారు.
ఇంత గొప్ప కార్యకమ్రం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని అలాగే మున్ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అమేటి రమేష్, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి ప్రభాకర్, అవోపా అధ్యక్షులు సంతోష్, కార్యదర్శి, శ్రీనివాస్, సన్మాన గ్రహీతలు సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.