కామారెడ్డి, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై లక్ష్మి (32) ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బాన్సువాడకు చెందిన బీర్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రజాక్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బాన్సువాడ నుండి వచ్చి రక్తాన్ని అందజేశారని, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో డెంగ్యూ బాధితులు ఎక్కువగా ఉండడం జరిగిందని వారికి కావలసిన తెల్ల రక్తకణాల దాతలు దొరకకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని కావున మానవతా దృక్పథంతో రక్త కణాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలన్నారు.
అత్యవసరంగా రక్తం కావాలని తెలియజేయగానే వెంటనే స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత అబ్దుల్ రజాక్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరమైనట్లయితే 9492874006 నెంబర్‌కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్, వి.టీ.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఏసుగౌడ్ పాల్గొన్నారు.