ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జనహిత ద్వారా ఆన్‌ లైన్‌ లో వచ్చే ప్రతీ దరఖాస్తును అధికారులు పరిశీలించాలని సూచించారు. పెండిరగ్‌ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »