1 – 19 సంవత్సరాల వయస్సు వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 01 నుండి 19 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వ తేదీన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెన్‌ డజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో నులి పురుగుల నివారణ దినోత్సవం కరపత్రాలు, గోడప్రతులను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నులి పురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మంద బుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతియేటా రెండు పర్యాయాలు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తుందని వివరించారు.

అన్ని వసతి గృహాలు, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, కిశోర బాలబాలికల సంఖ్యకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అల్బెన్‌ డజోల్‌ మాత్రలు పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. వైద్య, విద్యా శాఖతో పాటు ఐసీడీఎస్‌, సంక్షేమ శాఖ అధికారులు ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతమయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, జిల్లా ఇమ్యూనైజషన్‌ అధికారి అశోక్‌, ఏ.ఓ గంగాధర్‌, ఆర్గనైజర్‌ జి.వెంకటేశం, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పోషణ మాసంపై ప్రతిజ్ఞ
ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషణ లోపం లేకుండా, గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికల్లో రక్త హీనతను నివారించేందుకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ నెలను పోషణ మాసంగా పరిగణిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఇందులో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోషణ మాసం కార్యక్రమాలను విజయవంతం చేస్తామని, చిన్నారులు, బాలికలు, మహిళలను పోషణా లోపం నుండి విముక్తులను చేయిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేలా కృషి చేస్తామని, పోషణ అభియాన్‌ గురించి విస్తృత ప్రచారం చేపట్టి ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తామని కలెక్టర్‌ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »