నిజామాబాద్, సెప్టెంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో కొత్త ఉద్యోగాలు ఏవీ లేవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ లో ఏవైనా కొలువు ఇప్పించాలని కోరుతూ సోమవారం నాటి ప్రజావాణి సందర్భంగా పలువురు కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో కొత్త కొలువులు ఏవీ లేవని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని కలెక్టర్ హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.