అడ‌గ‌గానే ఆక్సీజ‌న్‌…

కామారెడ్డి, జూన్ 8

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంగ‌ళ‌వారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని గుర్జకుంట గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణకు ఆక్సీజ‌న్ అంద‌జేశారు.

బాలకృష్ణ కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా చికిత్స తర్వాత, డాక్టర్ సలహా మేరకు, ఆక్సిజన్ అవసరమని ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేశారు.

షబ్బీర్ అలీ వెంటనే స్పందించి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్ పంపించి, ఆక్సిజన్ అంద‌జేశారు.

బాలకృష్ణ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ త‌మ కుమారుడి ప్రాణాలు కాపాడిన షబ్బీర్ అలీ దేవుడని ఆయన ఎల్లకాలం చల్లగా ఉండి మరిన్ని సేవలు అందించాలని, అలాగే షబ్బీర్ అలీ కి ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మద్ది చంద్రకాంత్రెడ్డి, సంతోష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బూమ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »