కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుపై అధికారులకు సమీక్ష నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రం చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
శుభ్రం చేసిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్‌డివో సాయన్న, ఇన్చార్జి డిఎస్వో రాజశేఖర్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా సహకార అధికారిని వసంత, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, అధికారులు పాల్గొన్నారు.