నందిపేట్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట్ మండలం లోని సిహెచ్ కొండూరు గ్రామంలో గల లక్ష్మీనారాయణ స్వామి మందిరం అభివృద్ధికి చేపడతామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మంగళవారం మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో గల లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
తమ ఇంటి దైవమైన లక్ష్మీ నారాయణ స్వామి మందిర అభివృద్ధికి కృషి చేస్తానని పెర్కొన్నారు. తన మేనత్త గ్రామానికి తను రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన పెళ్లయిన కొత్తలో మందిరానికి వచ్చానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆలయ మందిరం తో పాటు గ్రామ ప్రజల సౌకర్యారార్థం కల్యాణ మండపాన్ని నిర్మిస్తామన్నారు.
ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి, టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కోటపాటి నర్సింహ నాయుడు, ఎం పి పి వాకిడి సంతోష్, జడ్ పి టి సి, యమున , వైస్ ఎం పి పి దేవేందర్, సర్పంచ్ ప్రభాకర్, ఎం పి టి సి రాజు వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎం పి టి సి లు, సోసైటీ చైర్మన్ లు పాల్గొన్నారు.