కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కేంద్రం తాళాలను చూశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎన్నికల అధికారి సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలం టేక్రియాల్‌లో ఉన్న అటవీ శాఖ నర్సరీని పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో మొక్కలను ఖాళీ చేయాలని సూచించారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను డీఎఫ్వో నిఖితను అడిగి తెలుసుకున్నారు. మర్రి, చింత, రావి, అల్ల నేరేడు, నెమలి నార, మామిడి, చైనా బాదం, మేడి మొక్కలు ఉన్నాయని తెలిపారు. 50వేల మొక్కలను ఇక్కడి నుంచి మున్సిపల్ నర్సరీకి తరలించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జితేష్ వి పాటిల్, శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రసాద్, మున్సిపల్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.