ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి గర్భిణీలకు సూచించారు. మోపాల్‌ వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా 102 అంబులెన్సులో గర్భిణీ మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు జరిపించేందుకు తీసుకెళ్తుండడాన్ని గమనించిన కలెక్టర్‌ వాహనాన్ని నిలిపి, ఆశా వర్కర్లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గర్భిణీలకు హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే మాత్రలు నాణ్యతతో కూడుకుని ఉంటాయని, అనవసర అపోహలను వీడి సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానాల్లో చేరాలని సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »