కామారెడ్డి, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటురి శ్రీకాంత్ మాట్లాడుతూ 1947 ఆగస్ట్ 15న భారత దేశానికి స్వాతత్య్రం వచ్చినప్పటికీ నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదని, సెప్టెంబర్ 13, 1948లో ఇస్లామిక్ ఉగ్రవాద నియంత నిజామ్ ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ పోలో సైనిక చర్య చేపట్టి తెలంగాణను నిజామ్ రాక్షస పాలన నుండి విముక్తి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆ మహనీయుని స్మరిస్తూ నేడు ఆయన విగ్రహానికి పూలమాల వేయటం జరిగిందన్నారు.
నేటి నుండి సెప్టెంబర్ 17 వరకు బీజేపీ ఆద్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి నాటి తెలంగాణ విమోచన దినోత్సవం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని వివరించారు.