మోర్తాడ్, జూన్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మృగశిర కార్తె ను పురస్కరించుకుని స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ పుత్రులు మోర్తాడ్ లోని ముసలమ్మ చెరువు నుండి చేపలు పట్టుకొచ్చి గ్రామంలో విక్రయించారు.
మృగశిర కార్తి రోజున చేపలు తినాలని గత సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానిక గంగపుత్రులు చేపలు పట్టుకు వచ్చి విక్రయించారు.
కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం పూట స్థానిక సర్పంచ్ భోగ ధరణి ఆనందు ప్రారంభించారు. ఇక్కడ. మోర్తాడ్ గ్రామస్తులు కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా వచ్చి చేపలను తీసుకెళ్లారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎఫ్ సి ఎస్ నూతి కట్టు రాములు, స్థానిక గంగపుత్ర సంఘం అధ్యక్షులు పోచయ్య, ప్రధాన కార్యదర్శి సతీష్, సత్యనారాయణ, నవీన్, రాజేశ్వర్, మద్ది శంకర్, శ్రీనివాస్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.