కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌జె వైద్యశాలలో పట్టణానికి చెందిన రోహన్ అనే బాలుడు డెంగ్యూ వ్యాధితో ఓ పాజిటివ్ ప్లేట్ లేట్ల సంఖ్య 20వేలకు పడిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్‌కు తెలియజేయడంతో కామారెడ్డి బ్లడ్ సెంటర్లో బుధవారం ఓ పాజిటివ్ ప్లేట్‌లేట్స్‌ను సకాలంలో అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజుకి పెరిగిపోతుందని వారికి కావాల్సిన ప్లేట్ లేట్స్ అందజేయడానికి దాతలు ముందుకు రావాలని గత రెండు నెలల నుంచి 20 మందికి సకాలంలో ప్లేట్ లెట్స్‌ను అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. వెంటనే స్పందించి ముందుకు వచ్చిన డాక్టర్ వేద ప్రకాష్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, కేబిఎస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్, వెంకటేష్, సంతోష్ తదితరులున్నారు.