నిజామాబాద్, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభించనున్న ఆదివాసి భవన్, బంజారా భవన్కు సంబంధించిన పోస్టర్ను గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తన చాంబర్లో అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదివాసి గిరిజన సమ్మేళనానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజనులు తరలిరావాలని కోరారు.
కార్యక్రమానికి బయలుదేరి వెళ్లే వారు తమ తమ గ్రామపంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావ్, పరిపాలన అధికారి సహదేవ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సీనియర్ అసిస్టెంట్ ఎం.ఏ.మాజీద్, ఎం.డీ.జావీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.