కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసినట్టు తెలిపారు. తెలంగాణ రాక ముందు విమోచన దినోత్సవం విషయంలో కొట్లాడి తెరాస పార్టీ తెలంగాణ వచ్చి అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆ ఊసే యెత్తలేదని అన్నారు.
గత సంవత్సరాల కాలంలో తెలంగాణ విమోచనం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించక పోవటంతో బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జండా ఎగర వేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించారని అన్నారు. బీజేపీ ఉద్యమాలకు తలొగ్గి ఈ సంవత్సరం సమైక్యత ఉత్సవాల పేరిట కొత్త నాటకం ఆడుతున్నారని, అది ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమేనని స్పష్టం చేశారు.