సాహిత్యానికి వెన్నుదన్ను గన్ను కృష్ణమూర్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కవి గన్ను కృష్ణమూర్తి ఆధునిక భావాలు కలిగిన కవి అని, మినీ కవిత్వంలో, రామాయణ పరిశోధనలో నూతన పంథాను సృష్టించాడని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్‌ నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం కేర్‌ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి రామాయణ పరిశోధకులు వక్త, వ్యాఖ్యాత సౌజన్యమూర్తి కీర్తిశేషులు కృష్ణమూర్తి సంస్మరణ సభ జరిగింది.

కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ క్లాస్‌ సాగర్‌ కి, ఋషి హృదయం, రామ్‌ కోన్‌ హే రామాయణం క్యా హై హిందీ కావ్యాలు, అండ్‌ ఎంప్రెస్‌ ఆఫ్‌ స్వోర్ట్స్‌, ఆటో బయోగ్రఫీ ఇంగ్లీష్‌ పుస్తకాలు, అడవి పూలు, కవితా కాలింది, అంతరంగం, కృష్ణవేదం, ఈ మట్టి నన్ను వెళ్ళనీయదు, వాసవి గేయ కావ్యం, కత్తుల కౌగిలి, శ్రీకృష్ణ రమ్య రామాయణం, కాకిలో కాకినై తోకలో ఈకనై, మహా ప్రభంజనం, యార్లగడ్డ వారి ద్రౌపది వస్త్రాపహరణం, రంగనాయకమ్మ విషవృక్షఖండన, కృష్ణ యానం ఒక నక్షత్ర మహాయానం, రాముడంటే ఎవరు రామాయణం అంటే ఏమిటి, చతుర్వేద సాగర మధనం, నాదమే వేదం వేదమే దైవం విమర్శనా గ్రంథాలు, అభిలేఖనం కోటి గొంతుకలు, గన్ను కృష్ణమూర్తి సాహిత్య సర్వస్వం మొదలైన కవితా సంపుటలు మొత్తం 22 పుస్తకాలను ఆయన రచించాడని వివరించారు.

కళాశాలలో బోధించేవి కామర్స్‌ అయినా ఆయన ఇంగ్లీష్‌ , తెలుగు, హిందీ, భాషల్లో సాహిత్యాన్ని సృష్టించిన పేరుకే గన్ను సాహిత్యానికి బలమైన పెన్ను గన్ను కృష్ణమూర్తి ఆయన సాహిత్యానికి వెన్ను కృష్ణమూర్తి అని విపి చందన్‌ రావు నివాళులర్పించారు. సాహిత్యానికి చైతన్యవంతమైన కన్ను కన్ను కృష్ణమూర్తి అని దారం గంగాధర్‌ నివాళి అర్పించారు.

సమాజానికి చైతన్యం కలిగించడమే కవి లక్షణమైతే ఆ లక్షణం పుష్కలంగా ఉన్న కవి గన్ను కృష్ణ మూర్తి అని తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ నివాళి అర్పించారు. తెలుగు భాషతోపాటు హిందీలో కూడా ఉన్నత స్థానానికి వెళ్లిన అఖిల భారతీయ కవి గన్ను కృష్ణ మూర్తి అని తిరుమల శ్రీనివాస్‌ ఆర్య నివాళులర్పించారు.

తపస్సు కథా సంకలనం ఆయన భవిష్యత్‌ దృష్టికి నిదర్శనమని గుత్ప్ప ప్రసాద్‌ నివాళులర్పించారు. అద్భుతమైన శిల్పంతో కవిత్వం రాయడంలో గన్ను కృష్ణమూర్తి ప్రతిభ సాధారణమైనదని కె.వి.రమణాచారి నివాళులర్పించారు.

రామాయణ భారతాలతో పాటు యోగ వాశిష్టాయ విద్యలో సమున్నత శిఖరాలు చేరుకున్న కవి గన్ను కృష్ణ మూర్తి అని కందాళై రాఘవాచార్య నివాళులర్పించారు. ఆధునిక ధార్మిక సంపన్నుడు అని ప్రముఖ ధార్మికవేత్త ఆచార్య శ్రీధర గన్ను కృష్ణమూర్తి స్మృతిలో నివాళులర్పించారు. కార్యక్రమంలో కాసర్ల నరేష్‌ రావు, సూరారం శంకర్‌, తెలుగు వెలుగు చంద్రయ్య, ఎలగందుల లింబాద్రి, చెన్న శంకర్‌, కొయ్యడ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »