కామారెడ్డి, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మూడవ రోజైన ఆదివారం 18వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కళాభారతిలో సాంస్క్రతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని జానపద కళాకారులు, కవులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సాంస్కృతిక ప్రదర్శనలు విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం నియోజకవర్గంలోని తాసిల్దార్లతో సంస్కృతిక ప్రదర్శనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదివారం కళాభారతిలో నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనకు మండలాల వారిగా జానపద కళాకారులను గుర్తించి కార్యక్రమానికి వచ్చే విధంగా చూడాలన్నారు. కవులు, కళాకారుల వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. సమావేశంలో తాసిల్దార్లు పాల్గొన్నారు.