కామారెడ్డి, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారిక పర్యటనలో భాగంగా హైకోర్టు జడ్జి ఎం.జె. ప్రియదర్శని కామారెడ్డి కోర్టు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ చంద్రమోహన్ ఆమెకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద హైకోర్టు జడ్జి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కామారెడ్డి డి.ఎస్.పి సోమనాథం, పట్టణ సీఐ నరేష్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.