కామారెడ్డి, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీ మంగళవారం రోజున ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కామారెడ్డి రక్తదాతల సమూహం, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం నిర్వహించనున్న మెగారక్తదాన శిబిరంలో జిల్లా పోలీసు సిబ్బంది కూడా పాల్గొని రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఏ.ఎస్పీ అనోన్యలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలు 3500 మందికి పైగా ఉన్నారని వారికి ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక యూనిట్ రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుందని ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కావాల్సిన రక్తం దొరకకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలని ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కర్షక్ బి.ఎడ్ కళాశాలలో శిబిరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ భాస్కర్ గుప్తా,కోశాధికారి వలిపీశెట్టి లక్ష్మీరాజ్యము పాల్గొన్నారు.