కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర, కేంద్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా నేడు 32 వ వార్డు పరిధిలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు డా.వీరేశం, డా.మల్లికార్జున్, డా. శ్రీధర్ ఉచిత పరీక్షలు నిర్వహించి, అవసరమగు వారికి ఉచితంగా మందులు అందజేశారు.
కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ అందరికీ ఉచిత వైద్యం నరేంద్ర మోడీ లక్ష్యం అని, మోదీ ప్రధానిగా వచ్చిన 8 ఏళ్లలో వైద్య రంగంలో ఎన్నో రకాల సంస్కరణలు చేపట్టారని, అనేక మెడికల్ కళాశాలలను స్థాపించారనీ అన్నారు. అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ప్రారంభించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఆయుష్మన్ భారత్ అమలు పక్రియ సరిగా లేదని వేరే రాష్ట్రాల్లో లాగానే తెలంగాణలో కూడా ఆయుష్మాన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని అన్నారు.