కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన పద్ధతి ప్రకారమే పంట కోత ప్రయోగం ఎంపిక చేసి, వచ్చిన దిగుబడి కచ్చితంగా తూకం చేసి డాటా ఎంట్రీలో ఎలాంటి పొరబాట్లు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ రేట్‌లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగం పద్ధతి గురించి మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటించి రైతులు వేసిన పంటల వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని కోరారు. ప్రాథమిక స్థాయిలో ఏఈవోలు, ఎంపిఎస్‌వోలు పంట కోత ప్రయోగం కొరకు ఎంపిక చేసిన పొలంలో పంట దిగుబడిని ఖచ్చితంగా నిర్ణయించి దిగుబడి వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు.
ఈ శిక్షణ తరగతులు ఉపగణాంక అధికారులు ఏ. శేఖర్ రెడ్డి, ఎల్. లక్ష్మణ్ శిక్షణను ఇచ్చారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆర్. రాజారాం, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన అధికారి శేఖర్ పాల్గొన్నారు.