కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం 41వ వార్డ్‌లో అభివృద్ది పనులలో భాగంగా రోడ్ పనులను 41వ వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమనీ గణేష్ అధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో, మున్సిపల్ చైర్మన్ చోరవతో ఎస్డిఎఫ్ నిధులతో 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
అందులో భాగంగా పంచముఖి హనుమాన్ కాలనీ 2వ గల్లీలో 5,00,000 రూపాయలతో సిసి రోడ్ పనులను బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమని గణేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.