కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ పోరాట యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీ నర్సింలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరేని నరసయ్య, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్, జిల్లా సంఘం ప్రతినిధులు రాజయ్య, సబ్బని ధర్మపురి, కృష్ణ హరి, షేర్ల రాములు, భూమేష్, గుజ్జ వెంకన్న, శిలాసాగర్, అడ్వకేట్ సిద్ధరాములు, గణేశు, బత్తిని సిద్ధ రాములు. రఘు తదితరులు పాల్గొన్నారు.