నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ రెండవ రాష్ట్ర మహాసభ ఈనెల 24 వ తేదీన ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణనంద్, ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. బార్ అసోసియేషన్ సమావేశపు హాల్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.
ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పాల్గొని సత్వర న్యాయం న్యాయవాదుల పాత్ర అనే అంశంపై ప్రధానోపన్యాసం చేయనున్నారని రాష్ట్ర స్థితిగతులపై, న్యాయవాదుల సమస్యలపై తీర్మాలను ఆమోదిస్తున్నట్లు వివరించారు.
అతిథిలుగా హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్, ఖమ్మం జిల్లాజడ్జి శ్రీనివాసరావు, అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సూర్య కరణ్ రెడ్డి, అఖిల భారతీయ అధివక్త పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ మూర్తి పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ సభ్యులు రాజ్ కుమార్ సుబేదార్, నరేందర్ రెడ్డి, విగ్నేష్, ఉదయ కృష్ణ, తోట శ్రీనివాస్, నరేష్ కుమార్, వసంత్ రావు, చిన్యా నాయక్, గోవర్ధన్, పిల్లి శ్రీకాంత్, అరేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.