అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన జాదవ్‌ కృష్ణ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ధర్మారంకు చెందిన సురేఖ (32) వెంకటేశ్వర నర్సింగ్‌ హోమ్‌లో అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటవ్‌ రక్తం అవసరం కావడంతో గాంధారి మండలం బొప్పాజీవాడి గ్రామానికి చెందిన డిగ్రీ మిత్రుడు జాదవ్‌ కృష్ణ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి రాత్రివేళ అయినా సరే ముందుకు వచ్చి వీ.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు.

రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు జితేష్‌ వి పాటిల్‌ తరపున కృతజ్ఞతలు తెలిపారు. యువకులు ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు. వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది చందన్‌, యేసుగౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »