క్లినిక్‌ను వినియోగించుకోవాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాందేవ్‌వాడలో ప్రారంభించిన మల్లు స్వరాజ్యం క్లినిక్‌ కరపత్రాలను ఆదివారం జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్‌ రామ్‌ మోహన్‌ రావు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో శాస్త్రీయ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ సూరి ఆధ్వర్యంలో క్లినిక్‌ను ప్రారంభించామని ప్రజలందరూ క్లినిక్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

క్లినిక్‌ లోఈ.సి. జి. బ్లడ్‌ టెస్ట్‌, నెబులైజర్‌,టెస్ట్స్‌ ఆస్తమా, బిపి, షుగర్‌, న్యూరో సమస్యలు తదితర చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో
డాక్టర్‌ రవీంద్రనాథ్‌ సూరి, వి ప్రసాద్‌ రావు, కే రామ్మోహన్రావు, ఈవీఎల్‌ నారాయణ, నర్సింలు, రమేష్‌ బాబు, నూర్జహాన్‌, ఆనంద్‌,తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »