కామారెడ్డి, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్, హైకోర్టు జడ్జి పి. నవీన్ రావ్ కు ఆదివారం కామారెడ్డి ఆర్అండ్బి గెస్ట్‌హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ నుంచి నిజాంబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఆర్అండ్బి గెస్ట్ హౌస్‌కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక జడ్జీలు, న్యాయవాదులు ఆయనను కలిశారు.