కామారెడ్డి, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశినగర్ మండలం భూంపల్లి గ్రామంలో చాలా కాలం కిత్రం నిర్మించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు వచ్చిందని గ్రామస్తులు తెలపడంతో మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్ పసుల సాయిలు, వార్డ్ మెంబర్ రమేష్, యాదవ సంఘం పెద్దలు మైపాల్, రమేష్, తిపిరిశెట్టి రమేష్, మరికొంతమంది ప్రజలు వాటర్ ట్యాంక్ శిథిలావస్థ గురించి మాజీ జెడ్పిటిసికి సూచించారు.
ఆదివారం ట్యాంకు పరిశీలించిన మాజీ జెడ్పిటిసి, ఎమ్మెల్యే జాజాల సురేందర్ దృష్టికి తీసుకెళ్లి నూతన ట్యాంక్ నిర్మాణం కానీ లేదా ట్యాంకుకు మరమ్మత్తులైన చేయించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అప్పటివరకు ట్యాంక్ కింది భాగానికి ఎవరు వెళ్లొద్దని, ట్యాంక్ నుంచి సరఫరా అవుతున్న నీరు తాగవద్దని, ఇతర పనులకు ఉపయోగించుకోవాలని సూచించారు.
పాఠశాల విద్యార్థులు కూడా ట్యాంకు కింది భాగానికి వెళ్లకుండా చూడాలని స్థానిక ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌కు సూచించారు. సంబంధిత ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో త్వరలో ట్యాంకు పరిశీలించాలని సూచిస్తామన్నారు.