నిజామాబాద్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 వ తేదీ నుండి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయని జెడ్పి సీఈఓ గోవింద్ తెలిపారు.
28 వ తేదీన వ్యవసాయంపై సమావేశం ఉంటుందని, 29 న ఉదయం విద్యా,వైద్యంపై, మధ్యాన్నం మహిళా శిశు సంక్షేమంపై, 30 న ఉదయం సాంఘిక సంక్షేమం, మధ్యాన్నం సమయంలో వర్క్స్ అండ్ ఫైనాన్స్ కమిటీ సమావేశం ఉంటుందని వివరించారు. సంబంధిత శాఖల అధికారులు, కమిటీల బాధ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.