నందిపేట్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 59 ప్రకారం స్థలల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థలాల నమోదు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా స్థలాల పరిశీలన చేసి వివరాలను 59 జిఓ వెరిఫికేషన్ యాప్‌లో పొందుపరుస్తున్నామని ఆర్ముర్ ఆర్‌డిఓ శ్రీనివాస్ రావు తెలిపారు. సోమవారం నందిపేట్ మండలంలోని చిమ్రాజ్‌పల్లి, నందిపేట్ శివారు పరిధిలోని ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ టీమ్‌ల పరిశీలనను ఆర్‌డిఓ శ్రీనివాస్ రావు పర్యవేక్షించారు.
ఈ సందర్బంగా ఆర్‌డిఓ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 58, 59 లలోని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న వారి గృహాలను, స్థలాలను ఆయా టీమ్‌లు నిబంధనల మేరకు పరిశీలిస్తున్నారని, ఆయా దరఖాస్తు దారులకు ఇళ్ల స్థలాలు సంక్రమించిన విధానాలు, డాక్యుమెంట్‌లను పరిశీలించి ఆప్‌లో తానే స్వయంగా పొందుపరుస్తున్నామని తెలిపారు.
ఆయా మండలాల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. నందిపేట్‌లో 12, చింరాజ్‌పల్లి 2 స్థలాలను పరిశీలించి వివరాలను పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ఆర్‌డిఓ వెంట ఆర్‌ఐ రాజేశ్వర్, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.