కామారెడ్డి, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 1 వార్డ్‌లో రెండు గదుల ప్రైమరీ స్కూల్ భవనమును ప్రారంభించిన 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీద రాణి మహేష్. ఈ సందర్భంగా 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది రాని మహేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు రెండు గదుల ప్రైమరీ స్కూల్ నూతన భవన ప్రారంభించడం జరిగిందన్నారు.
తమ గ్రామానికి నూతన రెండు గదుల ప్రైమరీ స్కూల్ భవనమును నిధులను మంజురూ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కి, మున్సిపల్ ఛైర్మన్‌కి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులకు తమ గ్రామము తరపున గ్రామ పెద్దల తరఫున ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో 1 వార్డు టిఆర్ఎస్ అధ్యక్షుడు నారాగౌడ్, ప్రైమరీ స్కూల్ చైర్మన్ ముధం తిరుపతి, హై స్కూల్ చైర్మన్ వెంకటలక్ష్మి ధరంపూరి, హై స్కూల్ వైస్ చైర్మన్ గోనుగపుల లింగం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విడిసి చైర్మన్ సాయిలు, గ్రామ పెద్దలు యువకులు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఇర్ఫాన్, భూమయ్య, సుధాకర్, సంతోష్, కిషన్, రఫిక్, రహెల్, రమేష్, కృష్ణంరెడ్డి, రాజు, నాయకులు, యువకులు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు.