కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆశ్రాన్ ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. డెంగ్యూ వ్యాధితో తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో బి పాజిటివ్ ప్లేట్‌లెట్స్‌ను అందజేసి ప్రాణాలు కాపాడారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల రెడ్‌క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో చాలామంది వివిధ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని వారికి కావలసిన తెల్లరక్త కణాలను అందజేయడానికి దాతలు ముందుకు రావాలని, సకాలంలో అందజేయకపోతే వారి ప్రాణాలు పోవడం జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో కేబిసి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్, టెక్నీషియన్లు పాల్గొన్నారు.