గాంధారి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ నిధుల నుండి గాంధారి మండలం ముద్దెల్లి గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మంజూరు చేశారు. కాగా మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పిట్ల కళావతి-లక్ష్మణ్‌తో కలిసి ఎంపీపీ రాధబలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్ సాయిరాం, స్థానిక ఉపసర్పంచ్ లక్ష్మగౌడ్, తెరాస గ్రామ అధ్యక్షులు ఓడ్నల అంజయ్య, మొండిసడక్-నర్సాపూర్ ఉపసర్పంచ్ రవి, సీనియర్ నాయకులు సుధాకర్ పటేల్, రవీందర్ రావు, వార్డు సభ్యులు గులామ్, పిట్ల మైసయ్య, మంగలి బాల్ రాజ్, కాశిం, కరోల సాయవ్వ, గౌస్, బంద్ షబ్, గ్రామ యువకులు బల్గురి సురేందర్, వెలుట్ల రాజు, కుమ్మరి తుకారం, నరేష్, రాజు గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.