కామారెడ్డి, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 13 వార్డ్ టేక్రియల్‌లో స్మశాన వాటిక నిర్మాణం జరగడం లేదంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేడుదుల రాజు, గడ్డ మీది రాజు, రాములు, ఆంజనేయులు మాట్లాడుతూ సంవత్సరాలు గడిచిపోతున్నా అధికారులు స్మశాన వాటిక నిర్మాణం విషయం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సంవత్సరాలు గడుస్తున్న స్థానిక కౌన్సిలర్ గాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు. మాజీ సర్పంచ్ స్మశాన వాటిక కొరకు స్థలము కేటాయించినప్పటికీ నిర్మించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే గ్రామ బయటకు తీసుకపోయి అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దయచేసి అధికారులు స్పందించి త్వరలో తమ గ్రామంలో స్మశాన వాటిక నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, పోచయ్య, కొత్తపల్లి సాయిలు, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.