కామారెడ్డి, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలు షూటింగ్ బాల్‌తో పాటు విలువిద్య క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం క్రీడాకారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బాలికలు అన్ని రకాల క్రీడల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ జట్టులో గాంధారి కేజీబీవీ కళాశాలకు చెందిన ఐదుగురు బాలికలు, పోతంగల్ గ్రామానికి చెందిన నలుగురు బాలికలు పాల్గొని సత్తా చాటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా షూటింగ్ బాల్ అధ్యక్షుడు సాయికుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రాథోడ్, జిల్లా టీఎన్జీవోఎస్ ప్రధాన కార్యదర్శి బి. సాయిలు, కేజీబీవీ ప్రిన్సిపల్ శిల్ప, జిల్లా పేట సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్ గౌడ్, నోముల మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.