కామారెడ్డి, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జిమ్ కేంద్రాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని పరికరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, నెలవారి ఫీజ్ రూ.100 ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జిమ్ కేంద్రం తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, ఎంపీపీ ఆంజనేయులు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.