కామారెడ్డి, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్ క్రీడాకారులకు మెడల్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలకు క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.