భిక్కనూరు, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని స్థానిక గాజులపేట్ కాలనీలో మురికి కాలువలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. అది భరించలేక కాలనీకి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు నేరుగా శుక్రవారం మురికి కాలువను శుభ్రం చేసింది. అనంతరం గ్రామపంచాయతీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
వృద్ధురాలు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి మురికి కాలువలను శుభ్రం చేస్తలేరని మండిపడిరది. పంచాయతీ అధికారులు ఇంత నిర్లక్ష్యానికి దిగజారడం మంచిది కాదన్నారు. కాలనీలో పలు రకాల సమస్యలు చాలానే ఉన్నాయని సైతం తెలిపారు. ఇకనైనా పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది మేల్కొని పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. లేనియెడల కాలనీవాసులతో గ్రామ పంచాయతీని ముట్టడిరచి సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.