హైదరాబాద్, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని తెలిపారు.