బ్రహ్మాజీవాడిలో కొత్త పింఛన్ల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రహ్మాజీ వాడి గ్రామంలో మంజూరైన కొత్త పింఛన్‌ డబ్బులను సర్పంచ్‌ జ్యోతి నర్సింహులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి బ్రహ్మాజీ వాడి గ్రామస్తుల దరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా యూత్‌ అధ్యక్షులు రమేష్‌ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఒక తెలంగాణలోనే జరుగుతుందని, అది మన ఉద్యమ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో, ఎమ్మెల్యే సురేందర్‌ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.

నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలలో మమేకమవుతూ ఉన్న సాదాసీదా మనిషి అయిన ఎమ్మెల్యే సురేందర్‌ అన్నకు తాము ఎల్లవేళలా తోడుంటామని లబ్ధిదారులు అందరు మనస్పూర్తిగా తెలిపారని రమేష్‌ రావు అన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ చిన్న గొల్ల రాములు, టిఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు, నాలుగవ వార్డు సభ్యులు డాకూరి నడిపోల్ల రమేష్‌ రావు, ఇతర గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »