రెంజల్, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధులకు గురికాకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ సుదర్శనం అన్నారు. శనివారం మండలంలోని బాగేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, ఎన్‌సిడి, టీబి, లెప్రోసి కార్యక్రమాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని సూచించారు.
కరోనా వ్యాక్సినేషన్ పెండిరగ్ ఉన్న చోట వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లో ప్రతి ఫ్రైడే డ్రై డేని ఉదృతం చేయాలని సిబ్బంది అందరు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని, ఆన్లైన్లో కార్యక్రమాల డేటాను ఎప్పటికప్పుడు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రావణ్ కుమార్, రవీందర్, ఏఎన్‌ఎమ్ కళావతి సిబ్బంది తదితరులు ఉన్నారు.