తహసిల్‌ కార్యాలయాన్ని నిర్బంధించిన విఆర్‌ఏలు

రెంజల్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి పే స్కేల్‌ విధానాన్ని అమలు చేయాలని గత 78 రోజులుగా వీఆర్‌ఏలు చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మె, సోమవారం రెంజల్‌ తహసిల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా ధర్నా నిర్వహించామని వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు నారాయణ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో సాయినాథ్‌, రవి, రమేష్‌, నరేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »