కామారెడ్డి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులతో పట్టణంలో నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు.
ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ కు లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. పట్టణంలోని విద్యానగర్, అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, స్నేహపురి కాలనీలోని ప్రజలకు తాగునీటిని అందించాలని పేర్కొన్నారు.
పాత పట్టణానికి ఫిల్టర్ బెడ్ ద్వారా తాగు నీటిని అందించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మిషన్ భగీరథ ఎస్సి రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.