హైదరాబాద్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 9 డిసెంబర్ 2022 న జరగబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రంను శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర విభాగ అధిపతి, జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ బి. నారాయణ మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యవసాయ రంగం యొక్క పర్యావలోకనం మరియు అవకాశాలు’’ అనే అంశంపై డిసెంబర్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సదస్సులో పాల్గొనబోయే అభ్యర్థులందరూ నవంబర్ 25 వరకు తమ పరిశోధన పత్రాలను సమర్పించాల్సిందిగా పేర్కొన్నారు. ఈ సదస్సును అద్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
కరపత్ర ఆవిష్కరణలో యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కె నరేందర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేష్, అర్థశాస్త్ర అధిపతి ప్రొఫెసర్ బి నారాయణ, చైర్మన్ ప్రొఫెసర్ డైసీ, జాతీయ సదస్సు సమన్వయకర్త డా. కే. కొండల్, ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ రాములు, ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ లక్ష్మి, ప్రొఫెసర్ రత్నకుమారి, ప్రొఫెసర్ మాధురి స్మిత, అర్థశాస్త్ర అధ్యాపకులు, వివిధ శాఖల అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.