ఎడపల్లి, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంట మార్పిడి చేసి నూతన పద్ధతుల్లో చిరుధాన్యాలను పండిరచడానికి రైతులు ముందుకు రావాలని చిరుధాన్యాల పంటలతో అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన మహిళా కిసాన్ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడారు.
మార్కెట్లో చిరుధాన్యాలకు విపరీతమైన డిమాండ్ ఉందని డిమాండ్ కనుగుణంగా రైతులు పంట మార్పిడి చేసి చిరుధాన్యాల పంటలను సాగు చేయాలని ఆయన కోరారు. చిరుధాన్యాలను తినడం ద్వారా షుగర్, బిపి వంటి దీర్ఘ కాలిక రోగాలు కంట్రోల్లో ఉంటున్నాయని జొన్నలు, రాగులు, సామలు, సజ్జలు, వంటి చిరు ధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుకు రావాలని కోరారు.
వ్యవసాయంలో మహిళా రైతుకు సరైన గుర్తింపు లేదని కేవలం కూలీగానే ముద్ర వేశారని అన్నారు. కాని మహిళా రైతులు నేటి సమాజంలో ముఖ్య పాత్ర పోశిస్తున్నారని ఇది గుర్తేరగాలని అన్నారు. మహిళా కిసాన్ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా పలువురు మహిళా రైతులను సన్మానించారు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ రజిత యాదవ్ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళా రైతులను ఘనంగా సన్మానించారు వీరితో పాటుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ ను ప్రజాప్రతినిధులు సన్మానించారు.
ఈ సందర్భంగా మండలంలో రైతు బీమా మంజూరైన రైతులకు ప్రోసిడిరగ్ ఆర్డర్ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, ఎడపల్లి సొసైటీచైర్మన్ మల్కా రెడ్డి, ఎంపీటీసీలు, మండల ఏవో సిద్ధిరామేశ్వర్, ఏఈఓలు, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.